పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ పరిధిలోని రామయ్యపల్లిలో నాగసాధు అఘోరీ హల్ చల్ చేసింది. తోటరామయ్య అనే వ్యక్తి ఇంటికి చేరిన అఘోరీని.. చూసేందుకు జనం ఎగబడ్డారు. అక్కడికి చేరిన పోలీసులపై అఘోరి చిందులు తొక్కారు. అఘోరిని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న వ్యక్తి సెల్ ఫోన్ లాక్కొని దాడికి యత్నించింది. ఈ క్రమంలోనే అడ్డుకోబోయిన ఎస్ఐని, పోలీసులను అఘోరీ దూషించింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహవేషాలతో తల్వార్ తీసి దాడికి యత్నంచిన అఘోరీని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.