సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ సక్సెస్ ల తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ అడ్వెంచర్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (SSMB 29)
మహేష్-రాజమౌళి (SSRMB) సినిమా కోసం ప్రియాంక ఏకంగా రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రియాంక రూ.30 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలోనే పారితోషికం డిమాండ్ చేసిందట. కానీ మూవీ టీం చర్చలు జరిపి రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ కి లాక్ చేసినట్లు సమాచారం. ఇండియన్ సినీ చరిత్రలో ఒక హీరోయిన్ కి ఏకంగా రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది రికార్డు అని చెప్పవచ్చు. రీజినల్ సినిమాలు చేస్తున్న కొందరు స్టార్ హీరోలే ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు.