“పెట్టుబడులను కొనసాగిస్తూ మౌలికవసతుల వృద్ధిని పెంచాలన్న ప్రభుత్వ సంకల్పంతో లాజిస్టిక్స్ ఖర్చులు దిగొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్‌తో కీలక సెక్టార్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు మెరుగుపడ్డాయి. ఫలితంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ అంతర్జాతీయ పరిశ్రమతో పోటీ పడుతోంది. రానున్న బడ్జెట్లో పీఎల్ఐని మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాము. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీకి ఊతం ఇచ్చే విధంగా ప్రభుత్వం విధానాలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాము. యువత నైపుణ్యాన్ని పెంచాలని, ఎంఎస్ఎంఈలకు సాయం చేయాలని, ఆర్ అండ్ డీని ప్రమోట్ చేయాలని, ఇన్నోవేషన్‌కి మద్దతివ్వాలని కోరుకుంటున్నాము,” అని టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- హెడ్ విక్రమ్ గులాటి అన్నారు.