“పెట్టుబడులను కొనసాగిస్తూ మౌలికవసతుల వృద్ధిని పెంచాలన్న ప్రభుత్వ సంకల్పంతో లాజిస్టిక్స్​ ఖర్చులు దిగొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్​ఐ స్కీమ్​తో కీలక సెక్టార్లు, కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీలు మెరుగుపడ్డాయి. ఫలితంగా భారత ఆటోమొబైల్​ పరిశ్రమ అంతర్జాతీయ పరిశ్రమతో పోటీ పడుతోంది. రానున్న బడ్జెట్​లో పీఎల్​ఐని మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాము. గ్రీన్​ ఎనర్జీ, గ్రీన్​ టెక్నాలజీకి ఊతం ఇచ్చే విధంగా ప్రభుత్వం విధానాలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాము. యువత నైపుణ్యాన్ని పెంచాలని, ఎంఎస్​ఎంఈలకు సాయం చేయాలని, ఆర్​ అండ్​ డీని ప్రమోట్​ చేయాలని, ఇన్నోవేషన్​కి మద్దతివ్వాలని కోరుకుంటున్నాము,” అని టయోటా కిర్లోస్కర్​ మోటార్​ కార్పొరేట్​ అఫైర్స్​ అండ్​ గవర్నెన్స్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​- హెడ్​ విక్రమ్​ గులాటి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here