సినీప్రేక్షకుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ని సంపాదించిన నటి సాయిపల్లవి(Sai Pallavi).అభిమానుల నుంచి లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని కూడా పొందిందంటే సాయిపల్లవి యాక్టింగ్ కి ఉన్న స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.మూవీ ఏదైనా సరే తన మార్క్ మాత్రం  స్పషంగా  ఉంటుంది.ఇందుకు ఆమె నటించిన గత చిత్రాలే ఉదాహరణ.ఇప్పుడు ఫిబ్రవరి 7 న యువసామ్రాట్ ‘నాగ చైతన్య’ తో కలిసి పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ‘తండేల్'(Thandel)యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.కానీ సాయి పల్లవి మాత్రం కనిపించటం లేదు.దీంతో ఆమె అభిమానుల్లో సాయి పల్లవి ఎందుకు కనిపించడం లేదనే చర్చ జరుగుతుంది.ఇప్పుడు ఈ విషయంపై నిన్న  ముంబై లో జరిగిన ఈవెంట్ లో తండేల్ చిత్ర దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti)మాట్లాడుతు సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం,జలుబు తో బాధపడుతున్నారు.దీంతో ఆమెకి కనీసం రెండు రోజుల పాటు అయిన రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారు.అందుకే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చాడు.

సాయిపల్లవి తండేల్ రిలీజ్ కి సంబంధించి చెన్నై వేదికగా జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొంది.ఈ సందర్భంగా సాయిపల్లవి ని ఉద్హేశించి చిత్ర నిర్మాత  అల్లు అరవింద్(Allu Aravind)మాట్లాడుతు ఒంట్లో బాగోలేదు కదా వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు.ఇక ‘తండేల్’ చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఇండస్ట్రీ వర్గాలతో పాటు అక్కినేని అభిమానులు,ప్రేక్షకుల్లో మూవీపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here