ప్రపంచంలో తెరకెక్కే ఏ భాషకి సంబంధించిన సినిమా మేకర్స్ అయినా కూడా,ఆస్కార్(Oscar)ని అందుకోవాలని ఆశపడతారు.ప్రపంచ సినీ అవార్డుల్లోనే అత్యున్నతమైనదైన ఆస్కార్ ని అందుకుంటే తమ జీవితం ధన్యమైపోయినట్టే అని కూడా భావిస్తారు.2023 కి సంబంధించి ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ని అందుకొని భారతీయ సినిమాకి ప్రపంచ సినీ పటంలో ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ‘అనుజా'(Anuja)అనే లఘు చిత్రం 97 వ అకాడమీ నామినేషన్స్ లో ‘లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం’ విభాగంలో  మన ఇండియా తరుపున ఆస్కార్ లో చోటు దక్కించుకుంది.దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు ‘అనుజా’ ఆస్కార్ ని అందుకోవాలని కోరుకుంటున్నారు. లాస్ ఏంజిల్స్ వేదికగా డాల్బీ థియేటర్ లో ఈ ప్రపంచ సినీ పండుగ మార్చి 2 న జరగనుంది.

ఇక ‘అనుజా’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే’ఆడమ్ జే గ్రేవ్స్'(adam j graves)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని గుణీత్ మోంగ(Guneet MOnga)నిర్మాతగా వ్యవహరించాడు.బాలకార్మికురాలిగా మారిన తొమ్మిదేళ్ల ‘అనుజా’ తన జీవితంలో ఎదురైన సంఘటనల మీద ఎలాంటి పోరాటం చెసిందనేదే ఈ చిత్ర కథ.ఇందులో బాలకార్మికుల జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు ఎంతో హృద్యంగా చూపించారు.2024 లో విడుదలైన ఈ లఘు చిత్రం 22 నిమిషాల నిడివితో రాగా సజ్దా పఠాన్(Sajda Pathan)అనన్య షాన్ బాగ్(Ananya Shanbhag)ముఖ్య పాత్రలో కనిపించారు.ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించింది.ఇక నిర్మాత గుణీత్ గతంలో పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్,అనే చిత్రానికి, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే లఘు చిత్రానికి ఆస్కార్ ని అందుకున్నాడు.

 

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here