చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ 2023 సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

 

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘డాకు మహారాజ్’. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇలా వరుస విజయాల తర్వాత బాబీ డైరెక్ట్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి నెలకొంది. రవితేజ వంటి హీరోల పేర్లు వినిపించాయి. బాబీ బాలీవుడ్ కి వెళ్తాడని కూడా వార్తలొచ్చాయి. ఈ వార్తల నడుమ ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. బాబీతో మరో సినిమా చేయడానికి చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందనుందట.

 

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకులు శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత బాబీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ లోపు బాబీ కూడా వేరే ఎవరైనా హీరోతో సినిమా చేస్తాడేమో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here