మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యే విమానాల టికెట్ ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. అనేక విమానయాన సంస్థలు దేశంలోని అనేక చోట్లు సాధారణ టికెట్ రేట్ల కన్నా 5,6 రెట్లు అధికంగా వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. భక్తుల సెంటిమెంట్‌పై వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళాకు వెళుతున్న భక్తులకు ఊరటనిచ్చే విధంగా, విమాన టికెట్ ధరలను 50శాతం కట్ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి కే. రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు.