Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స లా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘ప్రపంచ అనిశ్చితి మధ్య, మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక భారీ మార్పు అవసరం. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా ఏ ప్రయత్నం చేయలేదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, వేతన పెంపులో స్తబ్దత, వినియోగంలో పెరుగుదల లేకపోవడం, ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం, సంక్లిష్టమైన జీఎస్టీ వ్యవస్థ వంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు.
Home International Union Budget 2025: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స’ – బడ్జెట్ పై రాహుల్...