రూ.2,545 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు డీఆర్ఎమ్ గుర్తుచేశారు. ఈ రైల్వే లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో కలుపుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది విజయవాడ డివిజన్ నుంచి రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలన్నదే లక్ష్యం అన్నారు. విజయవాడ-విశాఖ డివిజన్ మధ్య 128 కిలోమీటర్ల ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సంక్రాంతి సమయంలో విజయవాడ డివిజన్ లో 86 శాతం రైళ్లు పంక్చువాలిటీతో నడిపినట్లు తెలిపారు.
Home Andhra Pradesh అమరావతి కొత్త రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి, అమృత్ భారత్ కింద 20 స్టేషన్ల అభివృద్ధి...