సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్స్ కూడా రాబట్టింది. సక్సెస్ సెలబ్రేషన్స్ యమ హుషారుగా చేస్తున్నారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.