పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. దేశం స్వచ్ఛ భారత్లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్లిపోతోందని ఆరోపించారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉందన్నారు. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ ఉందన్న బాబు.. అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపును తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.