తనకి పద్మ భూషణ్ కాదని.. నాన్నకు భారత్ రత్న రావాలని హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో మాట్లాడిన హీరో బాలకృష్ణ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్ష అని తెలిపారు. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని బాలకృష్ణ ఆశాభవం వ్యక్తం చేశారు.