సీతారామం,మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారాడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ తో భారీ విజయాన్ని అందుకున్న దుల్కర్ ప్రస్తుతం ‘కాంత'(Kaantha)అనే ఒక భిన్నమైన కథతో కూడిన సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై దుల్కర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుండగా, మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.దుల్కర్ సీరియస్ లుక్ తో ఉండటంతో పాటు,పాత తరం సినిమాల్లో హీరోలు వేసుకునే కాస్ట్యూమ్ తో ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.దీంతో మూవీలో దుల్కర్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
1950 వ నేపథ్యంలో జరిగే ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా చేస్తుండగా,సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాతలు కాగా, సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.ఝాను సంగీత దర్శకుడు.