హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనను ప్రేమ, పెళ్లి పేరుతో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. మీడియాలో నానా హంగామా చేసింది. ఇప్పుడు ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.

 

మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. సంచలన ఆరోపణలు చేసింది. మస్తాన్ సాయి తనపై లైంగిక దాడి చేశాడని, అలాగే ఎందరో మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి కాని యువతులు, పెళ్లి అయిన మహిళలు అనే తేడా లేకుండా మాయ మాటలు చెప్పి.. ఎందరినో లోబర్చుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు, వారికి తెలియకుండా వందల కొద్దీ నగ్న వీడియోలు తీశాడని.. అవన్నీ హార్డ్ డిస్క్ లో ఉన్నాయని తెలిపింది. మస్తాన్ సాయికి తెలియకుండా హార్డ్ డిస్క్ తీసుకొచ్చినట్లు చెప్పిన లావణ్య.. ఆ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించింది. ఆ హార్డ్ డిస్క్ లో రెండు వందలకు పైగా నగ్న వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. తాజాగా మస్తాన్ సాయిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here