మలేషియాలో అండర్ 19 మహిళా క్రికెట్ గెలుచుకున్న తర్వాత శంషాబాద్ వచ్చిన క్రికెట్ గొంగడి త్రిష అభిమానులు ఘన స్వాగతం పలికారు. అండర్ 19 ప్రపంచ కప్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఉపఖండం పిచ్చులకు అక్కడ ఆడుతున్న పిచ్చులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడామని తెలిపారు. కఠినమైన ప్రాక్టీస్ చేయడంతోనే విజయం సాధించామని పేర్కొన్నారు.