జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద ఘటన జరిగింది. బైక్ ను తప్పించబోయి ఎస్ఐ శ్వేత కారు చెట్టుకు ఢీ కొట్టింది. గతంలో వెల్గటూర్, కోరుట్ల ఎస్ఐగా ఈమె విధులు నిర్వహించారు. ఇటీవల జగిత్యాల డీసీఆర్బీకి శ్వేత బదిలీ అయ్యారు.