Tanuku SI AGS Murthy Audio Call: ఆత్మహత్య చేసుకునే ముందు తన స్నేహితుడికి కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు తణుకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి. ఇందుకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ఇందులో ఆయన తన స్నేహితుడికి పలు విషయాలు చెప్పుకొచ్చారు. కొంత మంది అధికారులు తనను మోసం చేశారని, జీవితం మీద విరక్తి కలిగిందని, తన భార్య, పిల్లలు పాపం అంటూ మాట్లాడారు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి.