Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు భారత్ లో మంచి ప్రాచుర్యం పొందాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ల కొత్త డిజైన్, శక్తివంతమైన పనితీరు, కెమెరా ఫీచర్లు భారతీయులను బాగా ఆకట్టుకున్నాయి. ఫ్లాగ్ షిప్ మోడళ్లు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ తన చౌకైన స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 9ఎను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. పిక్సెల్ 9ఎ మార్చి నెల ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా, పిక్సెల్ 9ఎ కు సంబంధించి అనేక లీకులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి. పిక్సెల్ 9ఎ వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియం, ఫిట్ బిట్ ప్రీమియంను ఉచితంగా ఆస్వాదించవచ్చని ఒక కొత్త నివేదిక ముందుకు వచ్చింది.