తొమ్మిదితో హనుమంతుడికి ఉన్న బలమైన సంబంధం

  1. 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హనుమంతుడు కుజుడుకి సంబంధించిన వారు. హనుమంతుడుతో పాటు మంగళవారం కుజుడిని కూడా పూజిస్తాము.
  2. ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అంగారకుడు అశుభం లేదా చెడుగా ఉండడం వలన అవ్వచ్చు.
  3. ఒకవేళ కుజుడు చెడుగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు.
  4. అదే కుజుడు శుభ స్థానంలో ఉన్నట్లయితే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
  5. ఎవరైతే ఏ స్వార్ధం లేకుండా వారి పనులు చేసుకుంటారో వారికి హనుమంతుడు ఆశీస్సులు కలుగుతాయి. నిర్మల హృదయం కలవారు, ఎలాంటి భేదం లేకుండా ప్రజలకు సహాయం చేసే వారు, సేవ చేసే వారికీ ఎప్పుడూ హనుమంతుడికి అనుగ్రహం ఉంటుంది.
  6. ఇలా ఈ విధంగా 9 సంఖ్య వారికి హనుమంతుడి అనుగ్రహం, కుజుడి అనుగ్రహం ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ఈ సంఖ్యకు సంబంధించిన వారు సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here