ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏడు నెలల్లోనే విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్లకు నిధులు తెచ్చుకోగలిగామని అన్నారు. సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానన్నారు. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.