ప్రతీకాత్మక చిత్రం(Jitender Gupta )
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరు లో ఎవరు విజయం సాధించారో ఫిబ్రవరి 8వ తేదీన తేలుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Wed, 05 Feb 202501:34 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ ఆఫ్ పోల్స్ అంచనా ఇదే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను అధ్యయనం చేసి, పోల్ ఆఫ్ ద పోల్స్ ను పలు న్యూస్ ఛానెల్స్ వెలువరించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పోల్ ఆఫ్ పోల్స్ స్పష్టం చేసింది. బీజేపీకి 43 స్థానాలు, ఆప్ కు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Wed, 05 Feb 202501:32 PM IST
బీజేపీ గెలుపు ఖాయం: చాణక్య స్ట్రాటెజీస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని చాణక్య స్ట్రాటెజీస్ అంచనా వేసింది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 39 నుంచి 44 సీట్లలో, ఆప్ 25 నుంచి 28 సీట్లలో విజయం సాధిస్తుందని చాణక్య స్ట్రాటెజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు జీరో నుంచి 1 సీటు రావచ్చని పేర్కొంది.
Wed, 05 Feb 202501:30 PM IST
హోరాహోరీగానే ఉందంటోన్న మరో ఎగ్జిట్ పోల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ ల మధ్య గట్టి పోటీ ఉందని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేసింది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ35 నుంచి 40 సీట్లలో, ఆప్ 32 నుంచి 37 సీట్లలో విజయం సాధిస్తుందని మాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు జీరో నుంచి 1 సీటు రావచ్చని పేర్కొంది.
Wed, 05 Feb 202501:30 PM IST
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. మూడు ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని తెలిపాయి. ఢిల్లీలో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ కు ఇది భారీ దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Wed, 05 Feb 202501:29 PM IST
బీజేపీ, ఆప్ ల మధ్య గట్టి పోటీ: జేవీసీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ ల మధ్య గట్టి పోటీ ఉందని జేవీసీ అంచనా వేసింది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ35 నుంచి 40 సీట్లలో, ఆప్ 32 నుంచి 37 సీట్లలో విజయం సాధిస్తుందని జేవీసీ అంచనా వేసింది. కాంగ్రెస్ కు జీరో నుంచి 1 సీటు రావచ్చని పేర్కొంది.
Wed, 05 Feb 202501:10 PM IST
బీజేపీ దే ‘ఢిల్లీ’ పీఠం – పీపుల్స్ ఇన్ సైట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 40 నుంచి 44 సీట్లలో, ఆప్ 20 నుంచి 29 సీట్లలో విజయం సాధిస్తుందని పీపుల్స్ ఇన్ సైట్ సంస్థ అంచనా వేసింది.
Wed, 05 Feb 202501:08 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 51 నుంచి 60 సీట్లలో, ఆప్ 10 నుంచి 19 సీట్లలో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
Wed, 05 Feb 202512:13 PM IST
5 గంటల వరకు 57.7 శాతం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 54.2% మాత్రమే నమోదైంది. 2020 లో మొత్తంగా 62% పోలింగ్ నమోదైంది.
Wed, 05 Feb 202511:48 AM IST
గత ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయి?
2015, 2020 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. 2015 లో మొత్తం 70 సీట్లకు గానూ ఆప్ 67 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 3 సీట్లలో గెలుపొందింది . 2020 ఎన్నికల్లో ఆప్ 62 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
Wed, 05 Feb 202511:12 AM IST
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడుతాయి?
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. ఈసీ ఆదేశాల అనుసారం, సాయంత్రం 6.30 గంటల తరువాత యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, ఐపీఎస్ఓఎస్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య సహా పలు ప్రముఖ పోలింగ్ సంస్థలు అంచనాలను విడుదల చేయనున్నాయి.
Wed, 05 Feb 202510:00 AM IST
ఢిల్లీ ఎన్నికల్లో మధ్యాహ్నానికి 33 శాతం పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 33.3% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ పోరు సాగించాయి. మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.