ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్(Amit Sharma )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 33.3% పోలింగ్ నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరు కొనసాగుతోంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన లైవ్ అప్ డేట్స్, పోలింగ్ శాతం, తదితర వివరాలను ఇక్కడ చూడండి.

Wed, 05 Feb 202511:48 AM IST

గత ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయి?

2015, 2020 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. 2015 లో మొత్తం 70 సీట్లకు గానూ ఆప్ 67 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 3 సీట్లలో గెలుపొందింది . 2020 ఎన్నికల్లో ఆప్ 62 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

Wed, 05 Feb 202511:12 AM IST

ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడుతాయి?

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. ఈసీ ఆదేశాల అనుసారం, సాయంత్రం 6.30 గంటల తరువాత యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, ఐపీఎస్ఓఎస్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య సహా పలు ప్రముఖ పోలింగ్ సంస్థలు అంచనాలను విడుదల చేయనున్నాయి.

Wed, 05 Feb 202510:00 AM IST

ఢిల్లీ ఎన్నికల్లో మధ్యాహ్నానికి 33 శాతం పోలింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 33.3% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ పోరు సాగించాయి. మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here