ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 70 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.56 కోట్ల మంది ఓట్లరు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరి కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. త్రిముఖ పోరులో ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.