SwaRail app: భారతీయ రైల్వే కొత్తగా ‘స్వరైల్’ యాప్ ను లాంచ్ చేసింది. ఈ స్వరైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, కంప్లయింట్స్, ట్రైన్ ట్రాకింగ్ వంటి సేవలను సులభంగా పొందవచ్చు. స్వరైల్ యాప్ తో భారతదేశంలోని రైలు ప్రయాణీకులు బహుళ రైల్వే సేవలను ఒకే ప్లాట్ఫామ్ పై పొందవచ్చు. టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్స్, ఫుడ్ ఆర్డర్లు, కంప్లైంట్ మేనేజ్మెంట్ వంటి వివిధ సేవలను ఒకే ఇంటర్ ఫేస్ లోకి అనుసంధానించడానికి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ కొత్త సూపర్ యాప్ ను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
Home International SwaRail app: ఇండియన్ రైల్వేస్ నుంచి కొత్తగా ‘స్వరైల్’ యాప్; టికెట్ బుకింగ్ సహా అన్ని...