Swiggy Q3 Results: 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ త్రైమాసికంలో (Q3FY25) స్విగ్గీ రూ.800 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ దిగ్గజం ఆదాయం 31 శాతం పెరిగింది. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ వ్యాపారాల ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో పెరిగింది. ఈ పండుగ త్రైమాసికంలో వినియోగదారుల కోసం సెగ్మెంటెడ్ ఆఫర్లను సృష్టించడంపై తాము దృష్టి సారించామని స్విగ్గీ ఎండి & గ్రూప్ సిఇఒ శ్రీహర్ష మజేటి అన్నారు. ‘‘ఇటీవలి నెలల్లో, మేము బోల్ట్ మరియు స్నాక్ (10 నిమిషాల ఫుడ్ డెలివరీ) ను ప్రవేశపెట్టాము, క్విక్-కామర్స్ లో కొత్త విభాగాలకు విస్తరించాము’’ అన్నారు. రెస్టారెంట్ ఈవెంట్ రిజర్వేషన్లపై కూడా దృష్టి సారించామన్నారు. ఈ Q3 లో తమ అన్ని ప్రాథమిక వ్యాపారాలలో అధిక వృద్ధిని సాధించామని చెప్పారు. అధిక పోటీ తీవ్రత మధ్య డార్క్ స్టోర్స్ విస్తరణ చేపట్టామని, జనవరి 2025 లో మరో 86 ఇన్స్టామార్ట్ స్టోర్స్ ను ప్రారంభించామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here