ప్రస్తుతం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సీనియర్ స్టార్స్, యంగ్ స్టార్స్ అనే తేడా లేకుండా అందరూ ఈ ఫీట్ సాధిస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మాత్రం ఇది అందని ద్రాక్షలా మారిపోయింది. ఈ క్రమంలో నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ పైనే అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వంద కోట్ల సంగతి అటుంచితే, కనీస ఓపెనింగ్స్ వస్తాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Thandel)

 

చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. దానికి తోడు ‘కార్తికేయ-2’ వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత, చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ‘తండేల్’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండాలి. అందుకు తగ్గట్టే అనౌన్స్ మెంట్ సమయంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉంది. కానీ ఆ ఆసక్తిని, అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మూవీ టీం సక్సెస్ కాలేకపోయింది. పైగా ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

 

నిజానికి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవ్వాలి. అలాగే ఆ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే స్థాయిలో అంచనాలు ఉండాలి. కానీ తండేల్ విషయంలో ఆ స్థాయి అంచనాలు కనిపించడం లేదు. నాగ చైతన్య నటించిన గత చిత్రాలు ‘కస్టడీ’, ‘థాంక్యూ’ నిరాశపరిచాయి. ఈ సినిమాలు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4-5 కోట్ల రేంజ్ గ్రాస్ కే పరిమితమయ్యాయి. ఇక చైతన్య కెరీర్ లో ‘వెంకీ మామ’, ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి హిట్ సినిమాల ఓపెనింగ్స్ ని గమనిస్తే.. ఫస్ట్ డే రూ.16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ రాబట్టాయి. వీటిలో ‘వెంకీ మామ’, ‘బంగార్రాజు’ మల్టీస్టారర్ లు కాగా, ‘లవ్ స్టోరీ’ సోలో హీరోగా చేసిన మూవీ. ఒకవేళ ‘లవ్ స్టోరీ’తో పోల్చి చూసినా, ‘తండేల్’ మొదటి రోజు రూ.16 నుంచి రూ.20 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాలి. అప్పుడే పాన్ ఇండియా సినిమాకి తగ్గ కనీస ఓపెనింగ్స్ వచ్చాయి అనిపించుకుంటుంది. అలాగే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడానికి బలమైన పునాది పడుతుంది. అలా కాకుండా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాకపోయినా, సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ రాకపోయినా.. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ కోసం మళ్ళీ ఎదురుచూడక తప్పదు. మరి ‘తండేల్’తో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చైతన్య సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here