చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ రెసిపీ

  1. బిర్యానీ వండడానికి ముందు పెద్ద చికెన్ ముక్కలు కట్ చేయించాలి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల ముందే నీటిలో నానబెట్టుకోవాలి.
  3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ ముక్క, అనాస పువ్వు, షాజీరా, జాపత్రి వేసి వేయించాలి.
  4. అందులో పుదీనా, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి.
  5. తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ, టమోటా ముక్కలను వేసి వేయించాలి.
  6. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా వేయించాలి.
  7. అందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా వేయించాలి.
  8. ఇందులోనే చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి ఉడికించాలి.
  9. చికెన్ 70 శాతం ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి, అవి ఉడకడానికి సరిపడా ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
  10. ఆవిరి పోకుండా పైన క్లాత్ కప్పి మూతపెట్టాలి. తరువాత్ స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే చెట్టినాడ్ స్టైల్ లో బిర్యానీ రెడీ అయినట్టే.

ఇక్కడ మేము చెప్పినట్టు చెట్టినాడ్ స్టైల్లో బిర్యానీ చేసి చూడండి ఘుమఘుమ లాడిపోతుంది. దీన్ని రైతాతో తింటే రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసిన వంటకాలు మాంసాహారులకు బాగా నచ్చుతాయి. బిర్యానీ రెసిపీ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే దాని రుచి మరింతగా మీకు నచ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here