2 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడిపోయిన ఘటన గుజరాత్ లోని వరియావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలియటంతో అధికారులు అక్కడికి చేరుకొని ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్, బసంత్ పారిఖ్ మాట్లాడుతూ.. భారీ వాహనంతో మ్యాన్‌హోల్ చాంబర్ మూత దెబ్బతిందన్నారు. తాము 100-150 మీటర్ల ప్రాంతాన్ని తనిఖీ చేశామని పేర్కొన్నారు.