బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌తో నిరసనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇళ్లును ఆందోళనకారులు ముట్టడించారు. దేశ రాజధాని ఢాకాలోని ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం జరినట్లు తెలుస్తోంది. కాగా, రెహమాన్‌కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.