ప్రధాని నరేంద్ర మోడీతో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ భేటీ అయింది. శుక్రవారం పార్లమెంట్ హౌస్ లో పీఎంని కలిశారు. మోడీని కలిసిన వారిలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఉన్నారు. అక్కినేని నాగేశ్వరావు (ANR) గురించి ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ రచించిన పుస్తకాన్ని మోడీకి అందించారు. ఈ సందర్భంగా సినీ రంగానికి ఏఎన్నార్ చేసిన ప్రధాని ప్రశంసించినట్లు సమాచారం. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఏఎన్నార్ ను ప్రశంసించారు మోడీ. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా పీఎంకి కృతఙ్ఞతలు తెలిపాడు నాగార్జున.

 

కాగా నాగ చైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ మూవీ ఈరోజు(ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే, ఇదే రోజు మోడీని అక్కినేని ఫ్యామిలీ కలవడం మరింత ప్రత్యేకంగా మారింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here