మొహాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచుకోవడానికి చర్మసంరక్షణ చాలా ముఖ్యం. సరైన విధానాన్ని అనుసరించడం వల్ల ఎక్కువ కాలం పాటు ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యంతో ఉండొచ్చు. దీని కోసం మీరేమీ భారీ విధానాలను అనుసరించాల్సిన అవసరం లేదు. కేవలం, రోజూ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, టోనింగ్ అంటే సీటీఎం(CMT) విధానాన్ని పాటించాలి. దీనిలో మొదటి దశ క్లెన్సింగ్, అంటే మొహాన్ని బాగా కడుక్కోవడం. ఇది చాలా ముఖ్యమైన దశ. మొహం మీద ఉన్న ధూళి, మురికి, అదనపు నూనెను తొలగించడానికి మొహం కడుక్కోవడం చాలా అవసరం. కానీ చాలా మంది మొహం కడుక్కునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అవి వారికి మేలు కన్నాఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ తప్పుల వల్ల మొహం మీద వృద్ధాప్యం సంకేతాలు త్వరగా కనిపిస్తాయి. చర్మంపై వృద్ధాప్య లక్షణాలు మాత్రమే కాకుండా మందంగానూ, ముదురుగానూ కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here