సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)నటనా రంగంలో ఎంత పెద్ద కీర్తి గడించారో అందరకి తెలిసిందే.సుదీర్ఘ కాలం నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఆ ఇద్దరు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి,లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నారు.పైగా ఆ ఇద్దరు ప్రాణస్నేహితులుగా ఎంతో మందికి ఇనిస్ప్రేషన్ గా కూడా నిలిచారు.
రీసెంట్ గా రజనీ కాంత్ తన కూతురు ఐశ్వర్య తో కలిసి తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ కి వచ్చాడు.రజనీని సాదరంగా ఆహ్వానించిన మోహన్ బాబు దగ్గరుండి రజినీకి యూనివర్సిటీ లో ఉన్న విద్యార్థుల క్లాస్ రూమ్స్,హాస్టల్ గదులు,లైబ్రరీ, కిచెన్ రూమ్ లాంటివి చూపించడం జరిగింది.అనంతరం ఇద్దరు చాలా సేపు మాట్లాడుకొని కొంత సమయం తర్వాత రజనీ అక్కడ్నుంచి బయలు దేరాడు.ఐశ్వర్య అయితే వెళ్ళేటప్పుడు మోహన్ బాబు పాదాలకి నమస్కరించగా మోహన్ బాబు కూడా ఐశ్వర్య ని ఆశీర్వదించాడు.ఇక సోషల్ మీడియాలో రజనీ,మోహన్ బాబు పిక్స్ వైరల్ అవుతుండంతో రజని కూడా మోహన్ బాబు దారిలోనే యూనివర్సిటీ ఏమైనా స్థాపిస్తాడేమో అనే చర్చ ఇద్దరి ఫ్యాన్స్ లో జరుగుతుంది.
రజనీ ప్రస్తుతం ‘కూలి'(Coolie)సినిమా చేస్తుండగా ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజుల నుంచి రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.మోహన్ బాబు తన కుమారుడు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక మూవీ ‘కన్నప్ప'(Kannappa)లో కీలక పాత్రని పోషించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.