ప్రేమికులందరూ ఎదురుచూసే ఫిబ్రవరి మాసం సంవత్సరంలో అత్యంత రొమాంటిక్ నెల. వాలెంటైన్స్ డేకు ముందు వారం రోజులను వాలెంటైన్స్ వీక్ పేరుతో వేడుకలా నిర్వహించుకుంటారు ప్రేమికులు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఈ రోజున అత్యంత అందమైన పువ్వులైన గులాబీలను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 7న దంపతులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీని ఇవ్వడంతో పాటూ ఒక పేపరుపై అందమైన కవితను రాసి ఇచ్చారంటే వారు గుండె ఉప్పొంగిపోవడం ఖాయం. లేదా ఫోన్ మెసేజులు, వాట్సాప్ లో రోజ్ డే శుభాకాంక్షలు కూడా పంపవచ్చు. రోజ్ డే శుభాకాంక్షలు ఇక్కడ తెలుగులో ఇచ్చాము.