యువసామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)కాంబోలో తెరకెక్కిన ‘తండేల్'(Thandel)నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.శ్రీకాకుళంలోని మత్స్యకారుల కుటుంబంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించగా చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వం వహించాడు.

ఇక ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్ గా  21 .27 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని సాధించింది.ఈ మేరకు బ్లాక్ బస్టర్ ‘తండేల్’ సునామి అంటు చిత్ర బృందం  అధికారకంగా ప్రకటించింది.చైతు కెరీర్ లోనే ఫస్ట్ టైం హయ్యస్ట్ గ్రాస్ సాధించిన మూవీ కూడా తండేల్ నిలిచింది. తండేల్ ముందు వరకు ‘లవ్ స్టొరీ’ సినిమా ఉండేది.ఇప్పుడు లవ్ స్టోరీ ని వెనక్కి నెట్టి ‘తండేల్’ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

ఇక మూవీకి అయితే ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు వ్యక్తం చేస్తున్నారు.చైతు,సాయి పల్లవి ల నటనతో  పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయనే అభిప్రాయాన్ని మెజారిటీ సినీ ప్రేమికులు చెప్తున్నారు.   

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here