ప్లాటినంను ప్రత్యేకంగా చేసేది దాని అరుదైన సాగే స్వభావం. రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కల ఢీకొనడం వల్ల ఏర్పడిన ప్లాటినం, బంగారం కంటే 30 రెట్లు అరుదైన లోహం. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రదేశాల నుండి మాత్రమే లభిస్తుంది. దానిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు గడిచినా దాని రూపం మారదట. ఇదే కారణంగా ప్రేమ, సుదీర్ఘమైన భావాలను వ్యక్తపరిచేందుకు ప్లాటినంతో గిఫ్ట్ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా, ప్లాటినంలో ప్యూరిటీ 95% ఉంటుందట. ఇది విలువైన ఆభరణాలలో అత్యధికం. ప్లాటినం వల్ల చర్మంపై అలెర్జీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇతర ఆభరణాలను మెరిసిపోయేట్లు చూపించడానికి దానిపై పాలిష్ లేదా పౌడర్ వేయాల్సి ఉంటుంది. ప్లాటినం విషయంలో అలా ఉండదు. ఇది సహజంగానే ఏకైక తెల్లని లోహం.