ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా కార్లది ప్రత్యేకమైన స్థానం. టాటా మోటార్స్ బ్రాండ్ భారత్‌లో టాప్‌లో ఉంటుంది. టాటా నుంచి కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చాయి. టియాగో, టిగోర్, పంచ్ ఈవీలు మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు పంచ్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లపై ధర తగ్గింపులో ఉంది. టాటా 2024 స్టాక్ కోసం ఈ ఆఫర్‌లను సిద్ధం చేసింది. అయితే 2025 మోడల్స్ మీద కూడా అఫర్స్ ఉన్నాయి. ధర తగ్గింపులను వేరియంట్‌ను బట్టి గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలుగా విభజించారు.