లైలా ట్రైలర్ చూస్తుంటే అడల్ట్ కామెడీ అనిపిస్తోంది. ఇలాంటివి బాలీవుడ్‌లో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా?
–అడల్ట్ కామెడీ అన్ని చోట్ల ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే కదా. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్, కొందరికి అర్ధం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వలన ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ, సినిమాలో అడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్‌గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది.