ఇవి చేయకూడదు..
శివుడికి ఎరుపు పువ్వులు సమర్పించడం మంచిది కాదు. శివుడికి బిల్వ పత్రం, మారేడు, జమ్మి, తెల్లని పువ్వులు అంటే ఇష్టం. ఎరుపు పువ్వులు శక్తిని సూచిస్తాయి. శివుడు శాంత స్వరూపుడు కాబట్టి.. ఆయనకు ఎరుపు పువ్వులు సమర్పించడం సరైనది కాదు. శివుడి పూజలో శంఖం ఉపయోగించడం మంచిది కాదు. శివుడికి కొబ్బరికాయ సమర్పించడం మంచిది కాదు. కొబ్బరికాయను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. శివుడి మంత్రాలను తప్పుగా ఉచ్చరించడం వల్ల ఆయనకు కోపం వస్తుంది. మంత్రాలను సరైన పద్ధతిలో, స్పష్టంగా ఉచ్చరించాలి. శివుడిని పూజించేటప్పుడు శరీరం, మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి. అపవిత్రంగా ఉండి శివుడిని పూజించడం వల్ల ఆయనకు కోపం వస్తుంది.