‘సామజవరగమన’ హిట్ తర్వాత శ్రీ విష్ణు(Sri Vishnu)’ఓమ్ భీమ్ బుష్”స్వాగ్’ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వాటిల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒక మోస్తరు విజయాన్ని సాధించినా కూడా ‘స్వాగ్’అయితే నిరాశపరిచిందని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు ‘సింగిల్(Single)’అనే మరో వినూత్నమైన టైటిల్ తో కూడిన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.అందులో ప్రముఖ కామెడి నటుడు వెన్నెల కిషోర్(Vennela Kishore)మాట్లాడుతు నాకు 35 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే ఒకడే కారణం అని చెప్పగానే ఒక విచిత్రమైన గెటప్ లో శ్రీ విష్ణు క్యారక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.దీంతో టైటిల్ కి తగ్గట్టే ఈ మూవీలో శ్రీ విష్ణు సింగిల్‌ అని అర్ధమవుతుంది.వెన్నెల కిషోర్ ఇంకా మాట్లాడుతు కాకపోతే ఈ సింగిల్ గాడ్నిఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని,చెప్పి చిన్న క్యూరియాసిటీ ని కూడా రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో కలిగించాడు.టోటల్ గా టీజర్ అయితే ఒక లెవల్లో ఉంది.

కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా చేస్తుండగా,విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ తో కలిసి విద్యా కొప్పినీడి, భానుప్రతాప్,రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తుండగా,కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.గీతా ఆర్ట్స్ రీసెంట్ గా తండేల్ తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here