ప్రతి ఏడాది వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురుచూస్తారు. ప్రేమ మాసమైన ఫిబ్రవరిలో 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న అందరూ టెడ్డీ డే నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున, జంటలు ఒకరికొకరు టెడ్డీని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, మీరు టెడ్డీతో పాటూ అందమైన శుభాకాంక్షలు కూడా మీ ప్రేమికులకు పంపండి. ఈ సందేశాల ద్వారా, మీరు మీ భావాలను పంచుకోవచ్చు.