ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2: ది రూల్ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ సాధించారు. అనేక రికార్డులను బద్దలుకొట్టారు. తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తారని గతంలో రూమర్లు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టినట్టు తెలిసింది. అయితే, అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వీరి కాంబినేషన్లో మూవీకి ఉండనుందని తాజాగా సమాచారం వెల్లడైంది.
Home Entertainment Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ సింగర్స్ కుమారుడు?...