చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సైదులుకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి మూడో కుమారుడు భానుప్రసాద్(14) చౌటుప్పల్లోని ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పిల్లల చదువుల కోసం ఆరేగూడెం నుంచి వచ్చి చౌటుప్పల్ నివాసం ఉంటున్నారు.