జనసేన తిరుపతి ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానంటూ బయటకు వచ్చిన లక్ష్మి అనూహ్య పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జైపూర్ పోలీసులు తిరుపతికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి తరఫు వారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా జైపూర్ పోలీసులు సమాధానం ఇవ్వకుండానే తమ వెంట తీసుకెళ్లారు. కిరణ్ ఫై ఆరోపణలు చేసిన రెండు రోజుల్లోనే లక్ష్మి ఇలా అరెస్ట్ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.