తండేల్ సినిమా హిట్ ను అక్కినేని నాగ చైతన్య ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్దార్ ఎన్ సర్వేశ్వర రావు ఇంటికి వెళ్లారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సర్వేశ్వర రావును పరామర్శించారు. ఇంట్లోని వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. అంతా బాగుంటుందని ధైర్యం చెప్పారు.