బీట్ రూట్ అట్లు రెసిపీ
- బీట్‌రూట్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి పక్కన పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో శెగనపిండి, ఓట్స్ పిండి, కారం, ఉప్పు, ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు బీట్ రూట్ ను మెత్తగా రుబ్బి అందులో వేసి కలుపుకోవాలి.
- ఈ బీట్ రూట్ ప్యూరీని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి అందమైన ఎరుపు-పింక్ కలర్ పిండిలా తయారు చేసుకోవాలి.
- అవసరమైతే నీరు కలపండి లేదా వదిలేయండి.
- ఇప్పుడు పనీర్ ను తురిమి ఫిల్లింగ్ తయారుచేసి తర్వాత పచ్చి కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
- నూనె వేడెక్కాక ఆ పిండితో అట్టులా వేసుకోవాలి.
- ఇప్పుడు రెండు వైపుల నుంచి లేత గోధుమ రంగులోకి, క్రిస్ప్ గా మారే వరకు ఉడికించాలి.
- తర్వాత పనీర్ ఫిల్లింగ్ ను ఒక వైపు వేసి మడతపెట్టాలి. అంతే అట్లు రెడీగా ఉన్నట్టే.
- అన్నింటిని ఒకే విధంగా తయారుచేసుకుని పెరుగు, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు కూడా ఎక్కువే. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని తినాల్సిన అవసరం ఉంది.