స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్: ఫీచర్లు
సెకండ్ టు టాప్, స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, డెకరేటివ్ డ్యాష్‌బోర్డ్ ఇన్సర్ట్స్, ప్యాడల్ షిఫ్టర్స్, క్రోమ్ యాక్సెంట్స్‌తో లెథర్ స్టీరింగ్ వీల్ వంటివి ఇందులో ఉన్నాయి. క్యాబిన్లో టీపీఎంఎస్, రేర్ డీఫాగర్, క్రోమ్ యాక్సెంట్స్, టైప్-సీ యూఎస్బీ ఛార్జ్ పాయింట్లు ఉన్నాయి.