ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
అమ్మకాల విషయానికొస్తే మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్(EPV) అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. 2024 సంవత్సరంలో మహారాష్ట్రలో 15,044 యూనిట్లు అమ్ముడయ్యాయి. కర్ణాటక 14,090 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడై రెండో స్థానంలో ఉంది. కేరళ 10,982 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. తమిళనాడు నాల్గో స్థానంలో ఉండగా, ఇక్కడ 7,770 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది మాత్రమే కాదు 2024 సంవత్సరంలో 6,781 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైన ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది.