Gemini 2.0 Flash: ఏఐ మోడళ్ల పనితీరును మెరుగుపరచడంలో భాగంగా జెమినీ 2.0 ఫ్యామిలీలో మొదటి మోడల్ జెమినీ 2.0 ఫ్లాష్ ను గూగుల్ విడుదల చేసింది. ఇప్పుడు, ఇది గూగుల్ జెమినీ యాప్ వినియోగదారులందరికీ, డెస్క్ టాప్, మొబైల్ రెండింటిలోనూ జెమినీ 2.0 ఫ్లాష్ మోడల్ అందుబాటులో ఉంది. అదనంగా, గూగుల్ గత వారం జెమినీ 2.0 ప్రో ప్రయోగాత్మక వెర్షన్ ను కూడా విడుదల చేసింది. ఈ వెర్షన్ ప్రత్యేకంగా కోడ్-ఆధారిత పనుల కోసం రూపొందించారు. సంక్లిష్ట ప్రాంప్ట్ లను కోడింగ్ చేయడం, నిర్వహించడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.