తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినొద్దని సూచించారు. ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించదని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చికెన్‌ను 20 నిమిషాల పాటు ఉడికిస్తుంటాం. అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతారు. ఈ ఉష్ణోగ్రతలో వైరస్ బతికే అవకాశం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లతో సమస్య ఉండదని చెప్పారు.
Home Andhra Pradesh బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల హెచ్చరికలు-భారీగా తగ్గిన ధరలు-bird flu virus...